Tella Rommu Nalla Rommu
ఇదొక వ్యక్తి బాధ గురించి, ఒక సమూహ పోరాటం గురించి, ఒక ప్రాంత అస్థిత్వం గురించి, ఒక జాతి వివక్ష గురించి, ఒక కులం గురించి, ఒక మతం గురించి, ఒక దేశపు అన్యాయం గురించి మాత్రమే కాదు. ఇదొక ప్రపంచ గొంతుక, కవిత్వ పొలికేక, పిడికిలి, నెత్తురు, ఆరాటం, ఆక్రందన, ఆవేదన, ఆలోచన, అనుభవం, ఆవేశం, అవమానం, అనైతికం, నిరసన, నిర్భంధం, కోరిక, కష్టం, నష్టం, భీతి, సందర్భం, విచారం, విజ్ఞానం, చరిత్ర, ఊహ, జ్ఞాపకం, గాయం, మరణం, జననం, ప్రకృతి, పల్లె, పట్టణం, వెలుగు, చీకటి, ఆకాశం, భూమి, అనంతం, దయ, నిర్ణయ, దొంగ, దొర, దోపిడీ, మొదలు, మార్గం, గమ్యం, దేవుడు, దెయ్యం, స్వప్నం, సాకారం, బలం, బలహీనత, బాల్యం, యవ్వనం, వృధ్యాప్యం, ధనిక, పేద, రంగు, రూపం, అడవి, ఎడారి, సముద్రం, పొలం, బీడు, సూర్య చంద్రులు, నక్షత్రాలు, రాజు, రాణి, గతం, వర్తమానం, భవిష్యత్తు, బంధాలు, బంధుత్వాలు, ప్రేమకు, త్యాగాలు, ఆకాంక్ష, యుద్ధం, శాంతి, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, అందం, అందవిహీనం, స్వతంత్రం, బానిసత్వం, కాలం, సకల జీవరాశులు. ఇలా ఎన్నో ఎనెన్నో కలిశాకే 'తెల్లదొమ్ము నల్లరొమ్ము' అయ్యింది.
జాని తక్కెడశిల
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత